జర్నలిస్టుల సేవలు మరువలేనివి
చేగుంట, సెప్టెంబర్ 7,(విజయక్రాంతి) : ప్రతిక్షణం సమాజ సేవలో ముందుండే జర్నలిస్టుల(Journalists) సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట(Lions Club of Chegunta) అధ్యక్షులు రజనకు రాంచందర్ అన్నారు. చేగుంట జర్నలిస్టులకు లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో చేగుంట పట్టణ కేంద్రం లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పాల్గొని చేగుంట కు చెందిన జర్నలిస్టులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను, ప్రభుత్వాల దిష్టికి, తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు సాగుతుండే వ్యక్తులు జర్నలిస్టులని, జర్నలిస్టుల సేవలు వారు కొనియాడరు,ఈ కార్యక్రమం లో సెక్రటరీ బుర్కా నాగరాజు,డిస్టక్ చైర్ పర్సన్ వంటరి రాంరెడ్డి, క్యాషియర్ దుర్గం అనిల్ కుమార్, మాజీ అధ్యక్షులు శంబుని శ్రీనివాస్,సభ్యులు సతీష్ పాల్గొన్నారు.






