కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రింకూ సింగ్
07-09-2026 | 12:16pm
కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్సీ రేసులో స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ జట్టును రింకూ సింగ్ తన నాయకత్వంలో విజేతగా నిలిపాడు. దీంతో కేకేఆర్ పగ్గాలు అతనికి అప్పగించే అవకాశాలున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కేకేఆర్ తరఫున పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ, ఈ ఏడాది వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇటీవల కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టు తదుపరి సారథిపై ఆసక్తి నెలకొంది.






