7 September, 2026 | 1:06 PM

మద్దిశెట్టి సామేలు ప్రజాసేవలను అభినందించిన తురక నరసింహ

07-09-2026 | 12:02pm

సత్తుపల్లి, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): షామీర్‌పేట(Shamirpet)లోని మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) నివాసంలో ఎన్‌సీపీ పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీపీ పార్టీ బీసీ యువజన సంఘం (BYSA) జాతీయ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు అడ్వకేట్ షేక్ షా వలి మరియు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డి-నోటిఫైడ్, సంచార మరియు పాక్షిక సంచార కమ్యూనిటీల కోసం అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు సభ్యుడు తురక నరసింహలను మద్దిశెట్టి సామేలు ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా తురక నరసింహ మాట్లాడుతూ మద్దిశెట్టి సామేలు చేస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న కృషిని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న తీరును ప్రశంసించారు. అలాగే ఎన్‌సీపీ పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సామాజిక న్యాయం కోసం కృషి చేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌సీపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుట్టబంతి హరిబాబు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పలగాని శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఈదుల రవి, తాటి రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు