12 March, 2026 | 2:31 PM

Breaking News

మళ్లీ తెరపైకి మద్యం కేసు.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు   •   నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే   •   భారత్‌కు ఊరట.. ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి   •   అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి   •   పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు   •   పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి   •   గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి   •   గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి   •   గాజులపేట కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం   •  

10 నెలల కనిష్ఠానికి సర్వీసుల రంగం

17-10-2024 12:33 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కొత్త ఆర్డర్లు, అంతర్జాతీయ విక్రయాలు తగ్గడంతో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో దేశంలోని సర్వీసుల రంగం కార్యకలాపాలు 10 నెలల కనిష్ఠానికి తగ్గాయి. తాజాగా విడుదలైన హెచ్‌ఎస్‌బీసీ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్ నెలలో 57.7కు తగ్గింది. ఆగస్టులో ఇది 60.9 మేర ఉన్నది. సేవల రంగంలో 2023 తర్వాత ఇంత మందకొడి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి.

పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం ఇండెక్స్ 50 ఎగువన ఉంటే వృద్ధిగానూ, 50 లోపు ఉంటే క్షీణతగానూ పరిగణిస్తారు. సెప్టెంబర్‌లో నమోదైన 57.7 మందకొడి వృద్ధిని సూచిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక సగటుకంటే అధికంగానే ఉన్నదని హెచ్‌ఎస్‌బీసీ సీనియర్ ఎకానమిస్ట్ ప్రంజుల్ భండా రీ చెప్పారు. ముడి వ్యయాలు పెరగడం, సేవల ధరలు అంతగా పుంజు కోకపోవడంతో సర్వీసుల రంగం లాభాల మార్జిన్లు మరింత తగ్గాయని భండారీ వివరించారు.