21 April, 2026 | 3:49 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురికి అస్వస్థత

24-06-2025 02:05 PM

ముంబై: లండన్ నుండి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో సోమవారం ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఏడుగురిలో ఇద్దరు ప్రయాణికులు ఇద్దరు క్యాబిన్ సిబ్బంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిని తదుపరి పరీక్ష కోసం నగరంలో ల్యాండింగ్ సమయంలో వైద్య గదికి తీసుకెళ్లి  వారిని పరిక్షించి డిశ్చార్జ్ చేశారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.

లండన్ హీత్రో నుండి ముంబైకి వెళ్లే AI130 విమానంలో (జూన్ 23) ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది విమానంలోని వివిధ దశలలో తల తిరుగుతున్నట్లు, వికారం ఉన్నట్లు తెలిపారని ఎయిర్‌లైన్ పేర్కొంది. విమానంలో ఉన్న మొత్తం ప్రయాణికులు, సిబ్బంది సంఖ్యను పంచుకోకుండా, విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయిందిని, అక్కడ ఎయిర్‌లైన్ వైద్య బృందాలు తక్షణ వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తలిపింది. ఈ సంఘటనను ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు నివేదించినట్లు ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది.