9 May, 2026 | 10:45 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య

17-03-2026 02:46 AM
  1. చాక్లెట్ ఆశచూపి పైశాచికం

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం

మణికొండ, మార్చి 16 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో తీవ్ర విషా దం చోటుచేసుకుంది. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించిన ఓ దుండగుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, కిరాతకంగా హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. బాలిక ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి, రాత్రి పది గంటల సమయంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి బాలికను తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించి, రాత్రి ఒంటి గంట సమయంలో చిన్నారి మృతదేహాన్ని చూపించాడు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.