17 March, 2026 | 12:20 PM

పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

17-03-2026 10:28 AM

మంచిర్యాలకు చెందిన భార్యాభర్తల మృతి

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో(Peddapalli) మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి మంచిర్యాలకు(Karimnagar to Mancherial) కారులో వెళుతున్న భార్యాభర్తలు బసంత్ నగర్ సమీపంలోని బుగ్గరావు స్వామి మూలమలుపు వద్ద కారు డివైడర్ ను ఢీకొనడంతో భార్యాభర్తలు మృతిచెందారు.

మంచిర్యాల  చెందిన ఎడ్ల శ్రీనివాస్, రాజీత దంపతులు కరీంనగర్(Karimnagar)లో వారి కూతురు చెల్మెడ ఆనంద్ రావు ఆసుపత్రిలో ఎంబిబిఎస్ చదువుతుండగా కూతురు వద్దకు వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో కూతురు రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన శ్రీనివాస్ అతని భార్యను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి కి పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు.