ఎస్‌జీఎఫ్ బాక్సింగ్ సెలక్షన్స్ విజయవంతం..

28-09-2026 | 08:27pm

రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది క్రీడాకారుల ఎంపిక..

కొత్తగూడెం సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో అండర్‌-14 బాలుర, అండర్‌-17 బాలుర, బాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు సి.ఆర్. క్లబ్ బాక్సింగ్ హాల్‌లో ఉత్సాహంగా నిర్వహించారు. సుమారు 80 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

అండర్‌-14 బాలుర విభాగంలో కే. సాకేత్ (28–30 కేజీలు), టీ. మణికంఠ (36–38 కేజీలు), జే. రేవంత్ కుమార్ (38–40 కేజీలు), జే. హరీష్ (40–42 కేజీలు), 42–44 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

అండర్‌-17 బాలుర విభాగంలో ఆర్. గణేష్ (మైనస్ 46 కేజీలు), ఎం. గణేష్ (46–48 కేజీలు), వి. సాయికిరణ్ (48–50 కేజీలు), వి. తనుష్ (50–52 కేజీలు), టీ. నాగరాజు (52–54 కేజీలు), ఎన్. వర్షిత్ (54–57 కేజీలు), బి. విశ్వేశ్ (57–60 కేజీలు), జి. అభిరామ్ (60–63 కేజీలు), బి. గణేష్ (63–66 కేజీలు) గోల్డ్ మెడల్స్ సాధించారు.

అండర్‌-17 బాలికల విభాగంలో కే. భావన (మైనస్ 42 కేజీలు), ఎస్‌.కే. షఫీ షరీన్ (46–48 కేజీలు), ఎం. అమృత జాస్మిన్ (48–50 కేజీలు), కే. సానియా (66–70 కేజీలు) గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఎంపికైన క్రీడాకారులు మంచిర్యాల జిల్లా వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ పరంధామ రెడ్డి, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం, ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ కార్యదర్శి బౌసింగ్, అబ్జర్వర్ నరేష్, బాక్సింగ్ కోచ్ ఆర్. శ్రీనివాస్, బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మట్టపర్తి రమేష్ విజేతలను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు