9 May, 2026 | 9:18 AM

కంగనాకు లీగల్ నోటీసులు ..

30-08-2024 04:09 PM

ముంబాయి: బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ కు శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఎస్ జీపీసీ మరో మారు వార్నింగ్ ఇచ్చింది.  కంగన నటించిన ఎమర్జెన్సీ సినిమా త్వరలోనే విడుదల కానున్న  విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ట్రైలర్ లో సిక్కు వ్యతిరేక సీన్లు ఉన్నాయని  సిక్కు సమాజం మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని  శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ  ఆరోపించింది. ఆ ట్రైలర్ ను తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమర్జెన్సీ సినిమా నిర్మాతలతోపాటు కంగనకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్ కు శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ  కార్యదర్శి ప్రతాప్ సింగ్ లేఖ రాశారు.