29 March, 2026 | 1:01 PM

రోడ్డు పనులు మొదలైయ్యాక మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయడం సిగ్గుచేటు

29-03-2026 11:24 AM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుండి సిర్గాపూర్ రోడ్డు పనులు మొదలైయ్యాక శనివారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేట అని సిర్గాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్ మండి పడ్డారు. గత రెండేళ్ల నుంచి గుర్తుకురాని రోడ్డు ఇప్పుడు తీరా పనులు స్టార్ట్ అయ్యాక ధర్నా చేయడం సరికాదన్నారు. సిర్గాపూర్ రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ బాలాజీ హార్ట్ మిక్స్ వారికి బ్లాక్ లిస్టులో ఉంచాలని మా ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులను ఆదేశించగా వారు కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చారు.

దాంతో ఆయన ఉగాది తర్వాత పనులు స్టార్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడు పనులు ప్రారంభించారు. ఇది అడ్వాంటేజ్గా తీసుకొని భూపాల్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో ధర్నా చేయడం సరైనది కాదు. ధర్నా చేస్తేనే పనులు స్టార్ట్ అయ్యాయని గొప్పలు చెప్పుకునేందుకు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కొత్త నాటకం ప్రదర్శించారు. మూడు రోజుల నుంచి పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ రోడ్డు పనులు పూర్తవుతాయాని, ధర్నా చేస్తేనే పనులు అవుతున్నాయని బిల్డప్ ఇవ్వడానికి బిఆర్ఎస్ ఎత్తుగడలు వేసింది. ఇన్ని రోజుల నుంచి గుర్తుకు రాలేదా..? మీ బిఆర్ఎస్ హయాంలో భూపాల్ రెడ్డి కుమారుడు రోషన్ రెడ్డి 21 అభివృద్ధి పనులు తీసుకొని ఒక్క పని చేయకుండా చేతకాక సంవత్సరం తర్వాత పనులు వదిలిపెట్టారు.

సీఆర్ఎస్ ఫండ్ 20 కోట్లతో మూడు గుంటల్ నుండి గౌడ్గామా చౌరస్తా వరకు మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మంజూరు చేశారు. నల్లవాగు నుండి తడ్కల్ వరకు కూడా రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించారు. నల్లవాగు డ్యాంకు 8 సం" కిందట  మంజూరు చేసిన రూ" 24 కోట్లు మంజూరు చేసినా ఏలాంటి అభివృద్ధి చేయలేదు. మా ఎమ్మెల్యే వచ్చాక పూర్తి చేశారు. ప్రతి గ్రామ పంచాయితీకి మహిళ సమైక్య భవనం, ప్రహరీ గోడలు, సిసి రోడ్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు నిర్మించడం జరిగింది. ఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ గ్రామంలో 133 KV సబ్ స్టేషన్ కడపల్ శివారులో నిర్మాణం చేయుటకు ప్రతిపాదనలు పంపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్  నాయకులు యాదవ రెడ్డి కడ్ప మాజీ సర్పంచ్, శ్రీనివాసరావు పాటిల్ సిర్గాపూర్ సర్పంచ్, సిర్గాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ గౌరవ  అధ్యక్షులు కళ్యాణ్ రావు పాటిల్, శ్యాం ప్రసాద్ సుల్తానాబాద్ సర్పంచ్, నరేందర్ గోసాయిపల్లి సర్పంచ్, పండరి పొట్టి పల్లి సర్పంచ్, నగేష్ గరిడేగం సర్పంచ్, జైరాజ్ మండల ఎస్సీ యువ నాయకులు, కృష్ణ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు, అబ్దుల్ హుసేన్, జమీల్, జుబేర్, అబ్రార్, మధుసుధన్ ముబారక్పూర్ మాజీ సర్పంచ్, విట్టల్ నాయక్ లక్ష్మణ్ తాడ సర్పంచ్, తుకారం, సుభాష్ కిష్టా గౌడ్, అలీమ్, విట్టల్ రావు పాటిల్, తేజ రావు, దశరథ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.