చలివేంద్రం ప్రారంభం
29-03-2026 11:13 AM
మోతె,(విజయక్రాంతి): శనివారం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దోస పాటి అనురాధ చలివేంద్రం ప్రారంభం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ సురకంటి లింగా రెడ్డి జ్ఞాపకార్థంగా ఎండలు మండుతున్న వేల రోజు వారీగా మండల కేంద్రానికి వివిద పనుల నిమిత్తం వచ్చి పోయే ప్రజలకు త్రాగు నీటిని అందించి దాహర్తి తీర్చే ప్రయత్నం చాలా గొప్ప మనస్సు కలిగిన హృదయం అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ చలి వేంద్రం ను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు వీరబాబు, నవీన్, కార్యదర్శి రవీందర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




