25 February, 2026 | 3:19 AM

శెన్‌బా కలల ప్రయాణం

25-02-2026 01:42 AM

‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్, టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’. రా కార్తీక్ రచనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనిధి సాగర్ నిర్మించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన ‘శెన్‌బా’ అనే అమ్మాయి దక్షిణ కొరియాకు వెళ్లాలని కలలు కంటుంది. ఆ కలను నిజం చేసుకునే క్రమంలో ఆమె సాగించే ప్రయాణమే ఈ సినిమా. ఈ సందర్భంగా తన పాత్ర గురించి ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. “శెన్బా కలలు ఆశ్చర్యం, ఆసక్తి నుంచి పుట్టినవి. కథ మొదట వినగానే నాకు ఆ పాత్రతో బలమైన అనుబంధం ఏర్పడింది” అని చెప్పారు.