సరికొత్త కథా సంఘర్షణతో బ్యాండ్ మేళం
‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీశ్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్, కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు శివాజీ మాట్లాడుతూ.. “బ్యాండ్ మేళం’ మంచి లవ్‌స్టోరీతో తెరకెక్కింది. ఇందులో నన్ను ఓ పాత్ర చేయమని అడిగారు.
కానీ రొటీన్ అవుతుందని వద్దని చెప్పా. ‘బ్యాండ్ మేళం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ.. “గుండెలోంచి వచ్చే ప్రేమకథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’తో తెలిసింది. ఆ స్ఫూర్తితోనే ‘బ్యాండ్ మేళం’ నిర్మించా. ఈ కథలోని సంఘర్షణ కొత్తగా ఉంటుంది. క్లుమైక్స్ అందరినీ కట్టి పడేస్తుంది” అన్నారు. కథానాయకుడు రోషన్ మాట్లాడుతూ.. “బ్యాండ్ మేళం’ పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్ విలేజ్ లవ్‌స్టోరీ. ప్రతీ ఎమోషన్‌ను పీక్‌లో చూపించే పాత్ర నాది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది” అని చెప్పారు.
కథానాయకి శ్రీదేవి మాట్లాడుతూ.. “కోర్ట్’తో మా అందరినీ ఎంతలా ఆదరించారో ‘బ్యాండ్ మేళం’పై కూడా అంతలా ప్రేమ చూపిస్తారని కోరుకుంటున్నా” అన్నారు. దర్శకుడు సతీశ్ జవ్వాజీ మాట్లాడుతూ.. “కోర్ట్’ తర్వాత మళ్లీ ఇలాంటి మంచి కథతో రాబోతోండటం ఆనందంగా ఉంది. నాని అన్న గర్వపడేలా నేను చిత్రాల్ని చేస్తుంటా” అని తెలిపారు. నందినీరెడ్డి, శివ నిర్వాణ, వేణు ఊడుగుల, తమన్ తదితర అతిథులు, చిత్రబృందం కూడా మాట్లాడారు.




