ఇల్లెందు బస్టాండ్‌లో షార్ట్‌సర్క్యూట్‌.. తప్పిన ముప్పు

11-09-2026 | 12:45pm

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్‌లోని(Yellandu bus stand) కంట్రోలర్‌ గదిలో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ చోటుచేసుకుంది. దీంతో గదిలోని పలు వస్తువులు దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బస్టాండ్‌ భవనం స్లాబ్‌ పెచ్చులు గతంలో ఊడిపడిన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్‌కు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.  కంట్రోలర్ గదిలో మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని  డిపో మేనేజర్ పరిశీలించారు.

మరిన్ని వార్తలు