కన్నుల పండుగగా శబరి మాత పాదపూజ
11-09-2026 | 01:13pm
బోథ్. సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): మండలంలో ని కనుగుట్ట గ్రామం(Kanugutta Village)లో అఖండ జ్యోతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాదపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కేంద్రానికి చెందిన కస్తూరి మధుకర్ విశ్వానందుల దంపతులు పాదపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పాదపూజకు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు