కరెంటు కోతలకు నిరసనగా బిఆర్ఎస్ ధర్నా

11-09-2026 | 01:28pm

సంస్థాన్ నారాయణపూర్ ,సెప్టెంబర్ 11(విజయ క్రాంతి):  కరెంటు కోతలకు నిరసనగా సంస్థాన్ నారాయణపురం(Samsthan Narayanapuram) మండల కేంద్రంలో  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ రైతులు, కూలీలు మహాధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకి కనీసం 8 గంటలు కూడా సరఫరా చేయలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యవసాయ పొలాల వద్ద మోటర్లు, పంపులు కాలిపోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు సరిపడా విద్యుత్తును వెంటనే సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు