గ్రూప్ ఉద్యోగానికి ఎస్సై ఎంపిక
01-04-2025 02:47 AM
గుడిహత్నూర్, మార్చి 31 (విజయ క్రాంతి) : గ్రూప్-1 ఫలితాల్లో గుడిహత్నూర్ ఎస్సై కరాండే మహేందర్ సత్తా చాటారు. దీం తో సోమవారం రత్న సాన్వి వెల్ఫర్ సొసైటీ వ్యవస్థాపకుడు ఉప్పారపు సత్యరాజ్ ఎస్‌ఐ ని కలిసి అంబేడ్కర్ చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో సన్మానించారు.
ఈ సంద ర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ పట్టుదల, ఏకాగ్రతతో చదివి గ్రూప్ ఉద్యోగాన్ని సాధించిన ఎస్సై మహేందర్‌ను పలువురు యువకులు స్ఫూర్తిగా తీసుకోవా లన్నారు. అమరేశ్వర్, సతీష్, రాహుల్, గణేష్, అశోక్, రాంకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






