11 July, 2026 | 9:18 PM

పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్

11-07-2026 08:18 PM

పినపాక,(విజయక్రాంతి): భద్రాద్రి డిసిసి ఉపాధ్యక్షులు గోడిశాల రామనాధం, పినపాక మండల అధ్యక్షులు పేరం వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో మండలంలోని  జానంపేట, ఉప్పాక, రాజుపేట, కిష్టాపురం, పొట్లపల్లి  గ్రామపంచాయతీలలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం  నిర్వహించారు. ఈ సందర్భంగా గోడిశాల రామనాధం, పేరం వెంకటేశ్వరరావు  గ్రామ ప్రజలను కలిసి ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, అర్హులైన 18 సంవత్సరాలు నిండిన యువత వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని, పేర్లు, చిరునామా లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని అవగాహన కల్పించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడంతో పాటు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జానంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి ఖాజా హుస్సేన్,  పినపాక మండల కాంగ్రెస్ పార్టీ  సర్పంచులు పూనం ఉమామహేశ్వరి, కారం పాపారావు, మట్ట బాబురావు, మద్దెల సమ్మయ్య, జానంపేట మాజీ ఎంపీటీసీ హరీష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.