ఈఎస్డీ కమిషనర్ ను కలిసిన మీసేవ నిర్వాకులు
11-07-2026 09:10 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో ESD (మీసేవ) కమిషనర్ గౌరవ శ్రీ రవికిరణ్,తెలంగాణ రాష్ట్ర మీసేవ ఫెడరేషన్ (TGMF ) జిల్లా నాయకులు APT Online మీసేవ VLE కామోజి వేణుగోపాల్, TGTS మీసేవ VLE అలీంలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ జిల్లాలో మీసేవ సేవల నిర్వహణ, యూరియా బుకింగ్ విధానం, కొత్త కమిషన్ అమలు తదితర అంశాలపై కమిషనర్‌తో చర్చించారు. మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆయన ఆరా తీసి, సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించినట్లు ప్రతినిధులు తెలిపారు.






