ఎస్ ఐ ఆర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
13-07-2026 03:46 PM
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్ (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ 2026 సర్వే(SIR survey) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. సోమవారం ఖానాపూర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డు విద్యానగర్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సేవా కేంద్రాన్ని సందర్శించి ఆమె సూచించారు. ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఓటర్ పాల్గొనేలా చేయాలని, పారాలు సేవా కేంద్రానికి వస్తే అక్కడ సిబ్బంది అధికారులు సహకరిస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి అంకం మహేందర్, నాయకులు ఎనగందుల నారాయణ, వెంకటరమణ ,గంగన్న, కొండాడి గంగారావు ,రాజేందర్, పలువురు వున్నారు.






