25 July, 2026 | 2:43 PM

సర్ ప్రక్రియను బి ఎల్ ఏ లు త్వరగా పూర్తి చేయాలి

25-07-2026 02:07 PM

మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.

తుంగతుర్తి(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం లోని గ్రామాల వారీగా 46పోలింగ్ బూతుల్లో సర్ ప్రక్రియ తుది దశకు చేరినందున గడువులోగా త్వరగా పూర్తి చేయాలని మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు లెవెల్ ఎజెంట్ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ...పార్టీ బూత్ లెవెల్ ఎజెంట్లు పూర్తి భాద్యత వహించి బి ఎల్ ఓ లకు సహకరిస్తూ శ్రద్ధ పెట్టి, పూర్తి చేయాలని అన్నారు.

ఇప్పటికే కొన్ని బూతు ల్లో 100శాతం పూర్తి అయినాయని. మిగతా గ్రామాలు గొట్టిపర్తి. వెలుగుపల్లి. తుంగతుర్తి. వెంపటి. అన్నారం లాంటి.మెజర్ గ్రామాలతో పాటు కొత్తగూడెం తూర్పుగూడెం. సంగెం. తదితర గ్రామాల్లో బూత్ లెవెల్ ఎజెంట్లు గ్రామ ముఖ్య నాయకులు సమన్వయం తొ ప్రతి ఓటర్ ను నమోదు చేయించాలని అన్నారు. చనిపోయినవారు. డబల్ ఓట్లు. మార్పిడి ఓట్లు జాగ్రత్తగా పరిశీలించి తొలిగించే విధంగా చూడాలని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్. మాజీ వైస్ ఎంపీపీ శ్రేశైలం వివిధ గ్రామాల bla లు సిమ్మద్రి. కర్ణాకర్. రాములు.  సమ్మద్, సర్పంచ్ లు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు