ఎమ్మెల్యే మురళి నాయక్ కు రాఖీ కట్టిన సోదరి
28-08-2026 11:03 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి):మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు సోదరీ మలోత్ సరోజిని రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదర,సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ తనకు అండగా నిలుస్తాయన్నారు.






