ధరణి భూ అక్రమాలపై SIT విచారణ.. 22 వేల ఎకరాల భూములపై దర్యాప్తు
భూభారతి సాఫ్ట్ వేర్ లోసుగులపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం
ధరణి భూ అక్రమాలపై SIT ఎందుకు ఏర్పాటు చేశారు?
తెలంగాణ ప్రభుత్వం ధరణి వేదికగా జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక SIT ఏర్పాటు చేసింది. 4,100 అనుమానాస్పద లావాదేవీలు, 22 వేల ఎకరాల భూముల హక్కుల మార్పు, అసైన్డ్ భూముల అక్రమ బదిలీలపై దర్యాప్తు చేయనుంది.
హైదరాబాద్: భూ భారతి సాఫ్ట్ వేర్(BhuBharati Software) లొసుగులపైనా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) విచారణకు సిద్ధమైంది. 4,100 అనుమానాస్పద లావాదేవీల్లో రిజిస్ట్రేషన్ల చార్జ్ ల దారిమళ్లింపుపై సర్కార్ ఫోకస్ చేసింది. అధికారులు ఇప్పటికే విచారణ నివేదికను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి(Minister Ponguleti Srinivasa Reddy) సమర్పించారు. సిద్దిపేట కుక్కునూరుపల్లి తహసీల్దార్ సుజాత సస్పెండ్ అయ్యారు. 56 దస్త్రాలను ఆమె నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించినట్లు ఆరోపణలున్నాయి. అసైన్డ్ భూముల(Telangana Assigned Lands) వారసత్వ బదిలీల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. 48 ఎకరాల భూముల హక్కుల మార్పుపై త్వరలో చర్యలు చేపట్టనున్నారు.
ధరణి ద్వారా భూ అక్రమాలపై ఎంక్వైరీకి సిట్!
ధరణి(Dharani) వేదికగా జరిగిన భూ అక్రమాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. సిట్ టీమ్ లో రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ వింగ్ ప్రతినిధులున్నారు. కాసేపట్లో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాల హక్కులు మారాయి?, 2020 నుంచి జరిగిన అనుమానిత భూ లావాదేవీలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించనుంది. ధరణిని అడ్డుపెట్టుకుని కాజేసిన ప్రభుత్వ, పట్టా భూములపై విచారణ జరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల ఎకరాల భూముల హక్కులు మారినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది.
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో అత్యధికంగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. జిల్లాల వారీగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించనుంది సిట్ బృందం. అక్రమాల వెనుక కీలక వ్యక్తుల నెట్ వర్క్ పై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లింకులు ఉన్నట్లు అను మాస్తున్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఆపరేటర్లు, దళారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు దొరికినవెంటనే ఎఫ్ఐఆర్ నమోదుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
FAQ's
ధరణి భూ అక్రమాలపై SIT ఎందుకు ఏర్పాటు చేశారు?
ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలు, అనుమానాస్పద రిజిస్ట్రేషన్లు, భూముల హక్కుల మార్పుపై విచారణ కోసం.
ఎంత భూమిపై విచారణ జరుగుతోంది?
సుమారు 22 వేల ఎకరాల భూములపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.
ఎన్ని అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు?
4,100 అనుమానాస్పద లావాదేవీలను అధికారులు గుర్తించారు.
ఏ జిల్లాల్లో ఎక్కువ అక్రమాలు గుర్తించారు?
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో ఎక్కువ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
Related Articles
భూభారతిలో చూపించని రైతుల వివరాలు
భూభారతి పెండింగ్ దరఖాస్తుల వేగం పెంచాలి
సాదా బైనామా, భూభారతి పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి
భూ పరిపాలనకు కొత్త దిక్సూచి భూభారతి
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
భూభారతి వచ్చినా తీరని భూ కష్టాలు
భూభారతి స్కామ్‌లో 15 మంది అరెస్ట్






