పిడుగుపాటుకు గేదెల మృతి
20-09-2026 | 02:20pm
నిర్మల్ ,సెప్టెంబర్, 20(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటు(Lightning strike) ప్రజలను భయోందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. నిర్మల్ రూరల్ మండలంలోని(Nirmal Rural Mandal) కౌట్ల కే లో పిడుగు పడి ముగ్గురు రైతులకు చెందిన ఆరు గేదెలు మృతి చెందాయి. సోను మండలంలోని జాబ్రాపూర్ లో చెట్టుపై పెరుగుకు పొడి కాలిపోయింది. మామడ మండలం ఫోన్ కాల్ గ్రామంలో చెట్టుపై పిడుగు పడటంతో కాండం చీరిక పడింది. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉరుము మెరుపులు పడడంతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు.