ప్రతి అర్హ కుటుంబానికీ సంక్షేమ ఫలాలు
అక్కలదేవిగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రజా సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు కీలకం: సర్పంచ్ ఆంజనేయులు గౌడ్
చివ్వెంల,(విజయక్రాంతి): మండలంలోని అక్కలదేవిగూడెం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సేవలు అర్హులకు చేరడంలో రేషన్ కార్డులు కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను మరింత సులభంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.