ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు స్ఫూర్తితో ఈ సేవా కార్య క్రమాలు
డాక్టర్ శ్రీరామ్ వెంకట్
సికింద్రాబాద్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 25 సంవత్సరాల నిరంతర ప్రజాసేవకు స్ఫూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాలు(Social service programs) చేపడుతు న్నామని బీజేపీ మహంకాళి జిల్లా ఇంటలెక్చువల్ సెల్ ఇంచార్జి డాక్టర్ శ్రీరామ్ వెంకట్ పేర్కొన్నారు. తార్నాక సేవా 25 పేరుతో రూపొందించిన కార్యక్రమాలు డివిజన్‌లో కొనసాగుతున్నాయి అన్నారు. సామాజిక సేవా కార్య క్రమాల్లో భాగంగా తార్నాక మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ(Distribution of clay Ganesha idols) చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ వెంక ట్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రతి ఒక్కరికీ స్ఫూ ర్తిదాయకమ ని అన్నారు.
అదే స్ఫూర్తితో తా ర్నాకలో సేవా కార్య క్రమాలను నిరంతరం కొనసాగి స్తూ ప్రజ లకు అండగా నిలుస్తా ఈ మని తెలిపారు.ఇప్పటికే 20కి పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించ గా శనివారం మరో నాలుగు కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు.ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన అడ్వ కేట్ అన్వీష్ మాట్లాడుతూ సేవ అనేది ఒ క్కరోజు కార్యక్రమం కాదు.నిరం తరం కొనసాగాల్సిన బాధ్యత అన్నారు. తార్నాక సేవా25 ద్వారా యువత కూడా సేవా కార్యక్ర మాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు సుబ్బారావు, కృష్ణ గౌడ్, దేవ, రాధాకృష్ణ, మోహన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.