స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సంఘీభావం
07-09-2026 | 03:33pm
- హైదరాబాద్, సెప్టెంబర్ 7: శాసనమండలి సభ్యుడు తాతా మధు(Thatha Madhu) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించారు. ఈ సందర్భంగా స్పీకర్ ఛాంబర్(Speaker's Chamber)లో గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటూ, ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
