26 March, 2026 | 3:35 AM

సోనియాగాంధీకి అస్వస్థత

26-03-2026 02:00 AM

సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స

న్యూ ఢిల్లీ, మార్చి 25: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ మంగళవారం అర్థరాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూ ప్ తెలిపారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందన్నారు. కడుపు, మూ త్రనాళానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

వాతావరణం, కాలుష్యం ప్రభావం చూపడం వల్లే ఆస్తమా సమస్య స్వల్పంగా పెరిగి ఉండొచ్చన్నారు. అందుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నామన్నారు.  తల్లి అనారోగ్యం కారణంగా రాహుల్ గాంధీ కేరళ పర్యటన రద్దయ్యింది. ఆయన స్థానం లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కోజికోడ్‌లో ప్రచారం చేస్తారు.