28 June, 2026 | 3:05 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

దక్షిణాఫ్రికా హ్యాట్రిక్

11-06-2024 01:09 AM

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం గ్రూప్ బంగ్లాదేశ్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. హెనిరిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ 2, ముస్తాఫిజుర్ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేసింది. తౌహిద్ హృదోయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మహ్మదుల్లా (27 బంతుల్లో 20) పర్వాలేదనిపించాడు. నోర్టే, రబాడలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.