21 August, 2026 | 10:48 PM

గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి

21-08-2026 09:56 PM

కామారెడ్డిలో జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం

రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ ఖలీల్  అహ్మద్

కామారెడ్డి,(విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ ను గ్రామస్థాయిలో మరింత పటిష్ట పర్చాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ ఖలీద్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ ఖలీద్ అహ్మద్ హాజరుకాగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో యువజన కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, IYC యాప్‌లో గ్రామ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా IYC యాప్ ద్వారా గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని నాయకులు కోరారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న యువతకు గుర్తింపు, అవకాశాలు కల్పించడం ద్వారా యువజన కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి, యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు.