20 August, 2026 | 3:17 AM

ఫొటో జర్నలిస్టులకు ఎస్పీ సునీత రెడ్డి శుభాకాంక్షలు

20-08-2026 12:00 AM

వనపర్తి టౌన్ ఆగస్టు 19: వరల్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి జిల్లా ఫోటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టులను సన్మానించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోటి అక్షరాలతో చెప్పలేని భావాన్ని ఒక ఫోటో ద్వారా చెప్పవచ్చని అన్నారు. చరిత్రను సజీవంగా నిలిపే ప్రత్యక్ష సాక్ష్యం ఫోటో అని, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిం చడంలో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.