అసెంబ్లీలో స్పీకర్ కంటతడి

07-09-2026 | 03:50pm

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7: అసెంబ్లీలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌(Speaker Gaddam Prasad Kumar) భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడుతుండగా ఆమె కూడా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. సీతక్క కన్నీళ్లు పెట్టుకోవడంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సైతం భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సభలో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు