calender_icon.png 5 December, 2024 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు

08-11-2024 12:54:36 PM

ఈ నెల 10న కురుమూర్తి స్వామిని  దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి దర్శనం నిమిత్తం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేయనున్నారు. ఈ మేరకు సీఎం విచ్చేస్తున్న సందర్భంగా జాతర పరిసరాలలో జిల్లా ఎస్పీ జానకి, తదితర అధికారులతో కలిసి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. సీఎం రాఘవేంద్ర స్వామి మన్నించి అవసరమైన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.