ఈద్గాను సందర్శించిన మున్సిపల్ చైర్మన్
17-03-2026 05:51 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల్లా రోడ్లో గల ఈద్గాను మంగళవారం మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంజాన్ పండుగను పురస్కరించుకుని మజీద్ పక్కనగల ఈద్గా వద్ద మున్సిపల్ కార్మికులచే చదను చేయించారు.
రాబోయే రంజాన్ ను పురస్కరించుకొని మజీద్ ల వద్ద, ఈద్గల వద్ద పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు ముస్లిం సోదరు లకు అవసరం ఉండే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. బిరుదు రాధా కృష్ణ వెంట పలువురు ఉన్నారు.




