17 March, 2026 | 7:07 PM

పోలీసులకు ఆరోగ్య శిబిరం

17-03-2026 05:38 PM

బెజ్జంకి: సిద్ధిపేట కమిషనరేట్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్ సిబ్బంది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నారు. వైద్యాధికారి మాధురి  పోలీస్ సిబ్బందికి  రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చారు. విధుల్లో ఒత్తిడి మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. ఈ శిబిరాలు కమిషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్లలో దశలవారీగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.