2 June, 2026 | 1:55 AM

పంట మార్పి డిపై ప్రత్యేక దృష్టి

02-06-2026 01:04 AM
  1. నదీ జలాల విడుదలపై సమన్వయం చేసుకోవాలి
  2. రామగుండం మొత్తం ఎరువుల కోసం కేంద్రానికి లేఖ..
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌కు నిధులు ఎన్నై నా విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నదీ జలాల విడుదలపై ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని, అంతరాష్ట్ర జలాల విడుదలకు ప్రొరేటా ప్రకారం చర్చించాలని స్పష్టం చేశారు. పంట మార్పిడి.. పంటల వైవిధ్యతపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

హై దరాబాద్ నగరంలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని, తాగు నీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు తలెత్తవద్దని యంత్రాంగాన్ని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న..రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని, వర్షాభావాన్ని ఎదుర్కోనేందుకు సన్న ద్ధం కావాలని తెలిపారు. వర్షాకాల సన్నద్ధతపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావారణ శాఖ నివేదిస్తున్నందు న కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా జలాలు దక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో నూ వర్షాభావ పరిస్థితులు నెలకొనేలా ఉ న్నందున అంతరాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకా రం తెలంగాణకు రావాల్సిన వాటా జలాలు వచ్చేలా ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి, తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు.

మహారాష్ట్రలోని కో యనా డ్యామ్ నీటిని వంద శాతం జల విద్యుదత్పత్తికే మహారాష్ట్ర వినియోగిస్తోందని, ఆ మొత్తం నీటిని మనం తీసుకొని వారికి అవసరమైన విద్యుత్ మనం సరఫరా చేసే దానిపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. గోదావరి నది వరదను, ప్రాణహితల వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సీ ఎం సూచించారు. 

డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు చేయాలి

రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. డ్యామ్‌ల  మెయింటెనెన్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశా రు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇ బ్బందులను సీఎం గుర్తు చేశారు. గేట్ల మరమ్మతులు, మెయింటెనెన్స్‌కు సంబంధించి ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. వాతావరణ శాఖ అంచనాలు, నివేదికల ఆధారంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. 

రామగుండం యూరియా తెలంగాణకే కేటాయించాలి

రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా అంతా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా మని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తాను క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమ లుపై అధికారులను ప్రశ్నించారు. నాడు ఇ చ్చిన హామీలు.. వాటి ప్రస్తుత పరిస్థితి.. ఏవై నా నెరవేరకుంటే అందుకు కారణాలతో తనకు నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.

వడగాలులు, వరదల సమయం లో ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోయినప్పుడు వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందే లా చూడాలన్నారు. వరదల సమయంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కూలిన వం తెనల స్థానంలో నూతన వంతెనల నిర్మాణం, ఇతర పనులకు విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని సూచించారు. 

క్యూర్ పరిధిలో రోడ్లపై వర్షం నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని గతంలో నిర్ణయించామని, వాటి పురోగతిపై అధికారుల ను ప్రశ్నించారు. ఇప్పటికే 11 వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పూర్తి చేశామని, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 

వర్షాకాలంలో నగరంలో సమస్యల పరిష్కారానికి మూగ్గురు కమిషనర్లు, మూడు నగరాల పోలీస్ కమిషనర్లు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లాల స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు నిర్ణీత సమయంలో భేటీ అవ్వాలని సీనెం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు సందీప్‌కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్, ధాన కిశోర్, టీకే.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.