మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల,ఏప్రిల్ 8(విజయ క్రాంతి):మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వా రోత్సవాల సందర్భంగా బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమం, జిల్లా సంక్షేమ శాఖ అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణి ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లాలోని 552 మంది అంగన్వాడీ కేంద్రాల బాధ్యులకు స్మార్ట్ ఫో న్లు పంపిణీ చేశారు.
జిల్లా సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య శాఖ పోస్టర్లను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ. గర్భిణీలు,పాలిచ్చే తల్లు లు, చిన్నపిల్లలకు మెరుగైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రసవానంతర తల్లులకు కూడా ఆరు నెలలపాటు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణ వివిధ శాఖలకు అప్పగించారని దీనిలో భాగంగా ఇప్పటివరకు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయడం,
అలాగే భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ఒక నివేదిక సిద్ధం చేయడం జరుగుతుందని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలు రెండు మున్సిపాలిటీల పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పగడ్బందీగా అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు.
స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హెచ్చరించారు. గర్భిణులు బాలింతలు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు ఇందులో భాగంగా త్వరలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
అన్ని హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, డైట్ చార్జీలు 40 శాతం పెంచామని, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామని తెలిపారు. అంగన్వాడీలకు ప్రతి ఇంటితో అనుబంధం ఉంటుందని స్పష్టం చేశారు. అంగన్వాడి కేంద్రాలకు నూతన భవనాలు వివోఏ భవనాలు జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు.మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు.మహిళలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.రైతులకు రుణమాఫీ, నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని, నూతన కుటుంబ సభ్యుల వివరాలు రేషన్ కార్డులో నమోదు చేస్తున్నామని తెలిపారు.
సన్న బియ్యం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి ఏడాది 14,650 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వెల్లడించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదే శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపా రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




