11 May, 2026 | 11:47 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ

11-05-2026 11:15 AM

దమ్మపేట,(విజయక్రాంతి): శ్రీ విజయ మహా గణపతి, శ్రీ మర్రి భక్తాంజనేయ స్వామి దేవాలయ మందిరాలల్లో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ మఱి భక్తాంజనేయ స్వామి కి ఉదయం 8.20'ని నుండి 11:00' ని. వరకు విశేష అర్చన (తమలపాకులు, తామర పుష్పాలు సింధూరంతో) నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు ఎటువంటి రుసుము చెలించక్కర్లేదనీ, కొబ్బరికాయలు మాత్రమే తీసుకుని రాగలరనీ, పూజ సామగ్రి ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తుందని, ప్రతి ఒక్కరికి గోత్ర నామ సంకల్ప సహితంగా అర్చన నిర్వహించబడుతుందని, అర్చన అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందని, సాయంత్రం 5.00 గంటలకు దేవాలయ ప్రాంగణము నుండి శోభాయాత్ర (బైక్ ర్యాలీ ) ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసి, స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆలయ స్థానాధిపతి చామర్తి సాయి ప్రసాద్ శాస్త్రి తెలిపారు.