అంగన్వాడీ ఆవరణలో సమాదులు
స్కూల్ వెళ్ళడానికి భయపడుతున్న పిల్లలు
చందుర్తి, ఆగష్టు,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిమండల కేంద్రంలోని అంగన్వాడీ పాఠశాలకు చదువు కోసం పిల్లలు రావడానికి జంకుతున్నారు. పిల్లలు పాఠశాలకు ఎందుకు వెళ్లలేక పోతున్నారని తల్లిదండ్రులను అరా తీస్తే, ఆ గొల్లవాడ పాఠశాలలో సమాధులు కాంపౌండ్ లోపల ఉండటం వల్ల విద్యార్థులు ఆ స్కూల్ కి రావటం లేదని తెలిసింది. ఇదే భయంతో గొల్లవాడ ప్రైమరీ స్కూల్ లో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం దీనికి నిదర్శనం. పిల్లలు ఆ సమాధులను చూసి భయభ్రాంతులకు గురవుతూ, అందుకే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ముఖ్య కారణమని తెలుస్తుంది. పాఠశాల నిర్మాణంలో ఆ సమాధులు కనిపించలేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు ఈ విషయమై తక్షణమే స్పందించి తగు చర్యలు తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.






