ధర్మపురి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: భట్టి విక్రమార్క
ధర్మపురి,సెప్టెంబర్6(విజకయాక్రాంతి): సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, కోటి 6 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని భట్టి ఈ సందర్బంగా పేర్కొన్నారు.






