శ్రావణ అమావాస్య సందర్భంగా గోశాల గోమాతలకు పూజలు

11-09-2026 | 01:31pm

గణపురం, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు శ్రావణ మాస(Shravan Amavasya) ఉత్సవాలలో భాగంగా అమావాస్య పర్వదినం చివరి శుక్రవారం సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతలను పూలమాలలు పట్టు వస్త్రాలతో అలంకరించి హారతి సమర్పించారు. శ్రావణమాసం ముగింపు శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మరిన్ని వార్తలు