అలరించిన డీఎస్పీ రఘునందన్ చౌహాన్
11-09-2026 | 03:36pm
భక్తులతో కలిసి ఆడి పాడిన అధికారి
బోథ్,సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతి కార్యక్రమానికి శుక్రవారం ఆదిలాబాద్ బెటాలియన్ డీఎస్పీ రఘునందన్ చౌహాన్(DSP Raghunandan Chauhan ) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శబరిమాత భక్తి గీతాలు ఆలపించి భక్తులను ఆలరించారు. డి.ఎస్.పి భక్తులతో ఆడి పాడారు. కార్యక్రమానికి సిఐ గురుస్వామి హాజరయ్యారు. వారి సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.