2 March, 2026 | 12:17 PM

చక్రిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ జయ రామ ఏకవాక్య సంకీర్తనలు

02-03-2026 01:34 AM

కుషాయిగూడ. మార్చి 1 (విజయ క్రాంతి): చక్రిపురం శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు మొదలైన శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏకవాక్య సంకీర్తనలు మధ్యాహ్నం వరకు కొనసాగినాయి. భక్తి పాటలు భక్తులను ఎంతో అల రించాయి. ముఖ్యంగా హిందు వాహిని నేత అరవింద్ హనుమాన్ చాలీసా, ఓం నమో నారాయణాయ, శ్రీరామ జయ రామ, ఏడుకొండలవాడా శ్రీ వెంకటరమణ భక్తి పాటల తో ఆలయ ప్రాంగణమంతా దద్దరిల్లింది.

ఏకవాక్య సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు పాటలు పాడారు అరవింద్ మా ట్లాడుతూ పిల్లలకు హిందూ ధర్మం గురించి నేర్పాలని పెడదోవ దారిన పడుతున్నారని నేటి బాలలు రేపటి బాలనాలని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఫౌండర్ మూలుగు ప్రతాప్ రెడ్డి, కలిగిరి పూజిత రెడ్డి గ్రీన్ కార్డు ఓల్డర్, డాక్టర్ చక్రధర్ రెడ్డి డాక్టర్ రష్మీ అర్చన రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ కనకారావు పద్మ వెంకటరెడ్డి దంపతులు జయ తోపా టు 200 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.