21 August, 2026 | 10:01 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

ఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్

03-08-2024 03:21 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని తహసి ల్దార్ కార్యాలయంలో మందమర్రికి చెందిన కాడం తిరుపతి, అనే రైతు నుండి కాల్వ శ్రీరాంపూర్ తాహసిల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు, డ్రైవర్ అంజాద్ లు పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారు లోని సర్వే నంబర్, 645/అ లో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధ్రువపత్రాలు ఉన్నా కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మోటేషన్ కోసం ఎన్నోసార్లు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించక పోవడంతో జిల్లా అధికారు లను కలవగా గత నెల 23న మోటేషన్ పూర్తయింది. గతంలో పలుమార్లు వీఆర్ ఏ మల్లేశం కుమారుడు విష్ణు కు ఫోన్ పే ద్వారా 15 వేల రూపాయలను తీసుకున్నారని, మరికొంత నగదు కావాలని తిరుపతిని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయగా ఏసీబీ అధికారులను సంప్రదించారని తెలిపారు. ఈ మేరకు ఈరోజు శనివారం తిరుపతి నుండి నగదు తీసుకుంటుండగా తాసిల్దార్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో ఏసీబీ డిఎస్పి రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.