24 April, 2026 | 4:46 PM

Breaking News

గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •   శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే   •   రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు   •   ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు   •  

మనసు ఆవేదనకు గురైంది

21-03-2025 12:00 AM

మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్‌ను తాజాగా నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం వరకూ జరిగింది. మూవీ టీమ్ అంతా లొకేషన్ నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. షూటింగ్ పూర్తయ్యాక స్థానిక ప్రజలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌లు వచ్చి రాజమౌళి, మహేశ్‌లతో ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రాజమౌళి ఒడిశాలోని ఒక పర్వతానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఒడిశాలోని అత్యంత ఎత్తున, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. “ఒడిశాలోని అత్యంత ఎత్తున అద్భుతమైన పర్వతం డియోమాలికి ట్రెక్కింగ్‌కి వెళ్లా. పై నుంచి వ్యూ అత్యద్భుతంగా ఉంది. కానీ పర్వతంపై ఉన్న చెత్తాచెదారం చూశాక మనసు ఆవేదనకు గురైంది. ఇటువంటి సహజమైన, అద్భుతమైన ప్రాంతాలను బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడూ బాధ్యతగా తీసుకోవాలి. ఇలాంటి అందమైన ప్రాంతాలను కాపాడుకోవడంలో సహకరించాలి. వ్యర్థాలను ఇక్కడ పడేయకుండా మీతో తీసుకెళ్లండి” అని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.