15 July, 2026 | 12:00 AM

కరీంనగర్‌లో అక్రమ లేఅవుట్ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం?

15-07-2026 12:00 AM

సర్వే నంబర్ 59లో అనుమతులు లేకుండానే లేఅవుట్ 

పాఠశాల, పెట్రోల్ బంక్, వైన్ షాప్, గోదాములకు హౌస్ నంబర్లు, విద్యుత్ మీటర్ల కేటాయింపు..!

కరీంనగర్, జూలై 14 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని జగిత్యాల రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 59లో సుమారు 2 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో అక్రమ లేఅవుట్ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ భూమికి దివంగత ఎగుర్ల నారాయణతో పాటు ఎగుర్ల రాంబాబు, ఎగుర్ల అశోక్, ఎగుర్ల శ్రీనివాస్, ఎగుర్ల రమేష్ యజమానులుగా ఉన్నట్లు సమాచారం.ఆరోపణల ప్రకారం, సం బంధిత శాఖల నుంచి ఎలాంటి లేఅవుట్ అ నుమతులు లేకుండానే పలు వాణిజ్య నిర్మాణాలు చేపట్టారని, వాటిలో పాఠశాల, పెట్రోల్ బంక్, వైన్ షాప్, హార్డ్వేర్ షాప్, మార్బుల్ షాప్, గోదాములు ఏర్పాటు చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంతేకాకుండా, ఈ నిర్మా ణాలకు హౌస్ నం బర్లు కేటాయించడమే కాకుండా వి ద్యుత్ మీటర్లు కూడా మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు.

అనుమతులు లేని నిర్మాణాలకు ప్రభుత్వ శాఖలు ఎలా హౌస్ నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాయనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయాన్ని పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

అక్రమ నిర్మాణాలు ఆపాలి. 

రేకుర్తిలో ని 59 సర్వే నెంబర్ అనుమతులు లేకున్నా ఇంటి నెంబర్ లతో పలు వాణిక్య సముదాయాల కు మీటర్లు ఇచ్చారు. దేవాలయం, ఈద్గా ఇన్న స్థలంలో మధ్యం షాపుకు అనుమతి ఇవ్వడం ఏంటి. వెంటనే చర్యలు తీసుకోవాలి

మహ్మద్ ఇమ్రాన్, రేకుర్తి

ఆందోళన చేస్తాం

సర్వే నెం: 59 లో 2 ఎకరాల 28 గుంటల స్థ లంలో అనుమతి లేకుండా ఇల్లీగల్ లేఔట్ నిర్మాణం జరుగుతోంది. ఈ లేఔట్లో స్కూల్, పెట్రోల్ పంప్, వైన్ షాప్, హార్డ్వేర్ షాప్, మార్బుల్ షాప్, టౌన్ ప్లానింగ్ లు వెలిశాయి అధికారు లు స్పందించడం లేదు. చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తాం

సయ్యద్ సాదిక్