అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో ఉండే విధంగా చూడాలి
* ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్
ఉట్నూర్, సెప్టెంబర్ 12( విజయక్రాంతి ): గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూడాలని ఉట్నూర్ సబ్ కలెక్టర్(Sub-Collector) కే. ప్రణయ్ కుమార్ బిఎల్ఓ లను ఆదేశించారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ ఐ ఆర్ నోటీసులు అందుకున్న వారి నుండి ప్రత్యేక దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లు తప్పులు రాకుండా చూసుకోవాలన్నారు.
18 సంవత్సరాల నుండిన యువతి యువకులు తమ పేర్లను నమోదు చేసేందుకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎస్ ఐ ఆర్ నోటీసులు అందిన ఓటర్లు ఆదివారం రోజున సైతం పూర్తి వివరాలతో తహసిల్దార్ కార్యాలయంలో , బి ఎల్ ఓ లకు అందచేయాలని అన్నారు. ఆదివారం సెలవు దినమైన ఓటర్ల కొరకు రెవిన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. ఆయనతోపాటు మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శోభ, రెవిన్యూ సిబ్బంది, బిఎల్వోలు పాల్గొన్నారు.