15 June, 2026 | 7:47 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

01-06-2026 05:12 PM

ముంబయి: అస్థిరమైన ట్రేడింగ్ సెషన్‌లో, కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించిన పరిణామాలను పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తుండటంతో, జూన్ 1న భారత బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్‌లో కూడా నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ (Sensex) 508.40 పాయింట్లు నష్టంతో 74,267.34 వద్ద, అలాగే నిప్టీ (Nifty) 165.15 పాయింట్లు నష్టంతో 23,382.60 వద్ద స్థిరపడ్డాయి.

ముడి చమురు ధరలు 4% మేర భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగి, బులియన్ సెంటిమెంట్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో బంగారం ధరలు బలహీనపడ్డాయి. MCX(Multi Commodity Exchange) గోల్డ్ సుమారు 0.92 శాతం క్షీణించి రూ.159500 వద్దకు చేరగా, COMEX గోల్డ్ దాదాపు 0.80 శాతం పడిపోయి $4500 జోన్‌కు చేరింది.

ఆటో, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంకులు, వినియోగ మన్నిక వస్తువులు (Consumer Durables), రియల్టీ రంగాలు 1-3 శాతం నష్టపోగా, ఐటీ సూచీ 2.6 శాతం, మీడియా సూచీ 1.3శాతం, మెటల్ సూచీ 0.5 శాతం లాభపడ్డాయి. నిప్టీలో హెచ్యూఎల్, టాటా కన్స్యూమర్, ఐటీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం&ఎం ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉండగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభపడాయి.