విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం
నాగలిగిద్ద, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలను నాగలిగిద్ద పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ జి. నాగపురే, BJYM మండల అధ్యక్షుడు ఎం. రమేష్, బీజేపీ మండల కార్యదర్శి రాజు స్వామి, బూత్ అధ్యక్షుడు ఎరుకలి రాజు, లొంకె హనుమంత్, హెచ్. నాగశెట్టి పాటిల్, ఆబ్కారీ మోర్చా మండల అధ్యక్షుడు, OBC మోర్చా జనరల్ సెక్రటరీ సురేష్ చాప్టే, బీజేపీ GP సభ్యుడు గొండేగావ్ బి. గంగశెట్టి, దత్తు, వీరభద్రుడు తదితరులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బీజేపీ, BJYM నాయకులు తెలిపారు.
