అక్షరాస్యతపై అవగాహనకు విద్యార్థుల ర్యాలీ

08-09-2026 | 07:06pm

కల్లూరు,(విజయక్రాంతి): ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని(World Literacy Day) పురస్కరించుకుని కల్లూరు మండలంలో విద్యార్థులతో(Students) అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో, ఎంఈవో, ఏపీఎం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. అక్షరాస్యత ప్రాధాన్యత, ప్రతి ఒక్కరికీ విద్య అందాల్సిన అవసరంపై విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈవో, ఏపీఎంతో పాటు ఉపాధ్యాయులు,సీసీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు